తండ్రి కాబోతున్న రానా.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న దగ్గుబాటి వారసుడు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒక్కటి.రామానాయుడు నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఆయన వారసుడిగా సురేష్ బాబు ఇండస్ట్రీలో నిర్మాతగా స్థిరపడ్డారు అలాగే వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే సురేష్ బాబు వారసుడిగా రానా లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ విధంగా రానా వరుస సినిమాలలో హీరో గాను విలన్ పాత్రలలోనూ నటిస్తూ సందడి చేస్తున్నారు.

ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే రానా 2020 కరోనా లాక్డౌన్ సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి మిహికా బజాజ్ అనే యువతని పెళ్లాడిన విషయం మనకు తెలిసిందే.

కరోనా కావడంతో కేవలం వీరి కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీరి వివాహం జరిగింది.ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఈ దంపతులు కూడా విడిపోతున్నారంటూ వార్తలు వినిపించాయి అయితే ఆ వార్తలు అన్నింటికి పూర్తిగా చెక్ పెట్టారు.ఇకపోతే తాజాగా ఈ దంపతులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది త్వరలోనే రానా మిహికా దంపతులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని దగ్గుబాటి ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.