శివగామిని ఇలా కూడా వాడేశారా?.. ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకున్న రమ్యకృష్ణ

Ramya Krishnan Shares Meme Video On IPL 2020 With Sivagami

బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై మన బాహుబలి ఇండియా సత్తాను చాటాడు. ఇక బాహబలి సినిమా ఎంతగా పాపులర్ అయిందో శివగామి, కట్టప్ప పాత్రలు కూడా అంతే క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికీ శివగామి పాత్రకు ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. రమ్యకృష్ణ సినీ కెరీర్‌లోనే శివగామి పాత్ర ఓ మైలురాయిగా నిలుస్తుంది. రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌కు శివగామి పాత్ర ఎంతగానో సాయపడింది.

Ramya Krishnan Shares Meme Video On IPL 2020 With Sivagami
Ramya Krishnan Shares Meme Video On IPL 2020 With Sivagami

ఇక ఈ సినిమాలోని కట్టప్ప, శివగామి, కాలకేయ మధ్య సంభాషణలకు సంబంధించిన సీన్ ఎంతగా హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సీన్ చివర్లో శివగామి.. కట్టప్ప సమర శంఖం పూరించు అనే డైలాగ్ ఎంతో రాజసంతో చెబుతుంది. ఇక ఆ సీన్ ఇప్పుడు కామెడీ చేసేశారు. ఆ సీన్‌కు ఐపీఎస్‌కు లింకు పెట్టి చేసిన ఈ వీడియో రమ్యకృష్ణను కదిలింది. ఈ మేరకు ఆ వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.

Ramya Krishnan Shares Meme Video On IPL 2020 With Sivagami
Ramya Krishnan Shares Meme Video On IPL 2020 With Sivagami

ఇక నేడు ఐపీఎల్ ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో శివగామి కట్టప్ప ఆర్డర్ వేసినట్టుగా ఆ వీడియో ఉంది. ఇక కట్టప్ప సమర శంఖం పూరిస్తుంటే.. ఐపీఎల్ మ్యూజిక్ రావడం, ఆపై చంద్రముఖి సినిమాలో రజినీ సన్నాయి వాయించడం, చివరగా రోజు మాస్ స్టెప్పులు వేయడం.. ఇలా ఐపీఎల్‌ను, బాహుబలిని, చంద్రముఖిని కలిపి ఎడిట్ చేయడంతో రమ్యకృష్ణ ముగ్దురాలైనట్టుంది. ఐపిఎల్ 2020, హ్యాపీ వీకెండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ రమ్యకృష్ణ సూచించింది.