Home News ఈ విషయం తెలిస్తే రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ కూడా అతన్ని తిడతారు.. !

ఈ విషయం తెలిస్తే రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ కూడా అతన్ని తిడతారు.. !

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా జనాలలో .. ఇండస్ట్రీలో సంచలనమే అవుతుంది. సినిమా విషయంలో గాని ఎవరినైనా కామెంట్ చేసిన విషయంలో గాని రామ్ గోపాల్ వర్మ సెంటర్ పాయింట్ అవుతాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రామ్ గోపాల్ వర్మ కి పెద్ద గా ఫీలవడు. ఆయనకి కావలసిన పబ్లిసిటీ .. ప్రాఫిట్ వచ్చేస్తాయి. ఒక సినిమా రిలీజయిందంటే ఇక ఆ సినిమా గురించి మర్చిపోతాడు. రెండవ సినిమా ప్రమోషన్ లోనో షూటింగ్ తోనో బిజీ అయిపోతాడు.

Rgv Thriller | Trailer | Apsara Rani | Ram Gopal Varma | Rgv Movie |  Thriller Rgv - Youtube

రామ్ గోపాల్ వర్మ ని పొగిడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో.. తిట్టుకునే వాళ్ళు అంతకి రెట్టింపు ఉన్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాల వల్ల ఎంతో మందికి జీవనోపాది లభిస్తుందని ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఎక్కువ మందికి ఆయన ఉపాది కల్పించినట్లవుతుంది అంటూ కరోనా సమయంలో వర్మపై ప్రశంసలు కురిపించారు. అందుకు కారణం కరోనా కి భయపడి అందరు షూటింగ్ లకు దూరంగా ఉంటే వర్మ మాత్రం కరోనాని లెక్క చేయకుండా స్వీటీ తో నగ్నం, అప్సర రాణి తో థ్రిల్లర్ సినిమాల షూటింగ్ చేసి కొద్ది మంది సినీ కార్మికులకు ఉపాది కల్పించి అండగా నిలిచాడు. ఈ సమయంలో ఇండస్ట్రీ వారు.. బయట వారు వర్మ ని పొగడ్తలతో ముంచేశారు.

అయితే తాజాగా వర్మ గురించి ఒక న్యూస్ వైరల్ అయి నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. వర్మ గురించి అందరు అనుకేది తప్పు అంటూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అభిప్రాయపడింది. తమ ఫెడరేషన్ కు చెందిన 32 యూనియన్లకు చెందిన టెక్నీషియన్స్ కు వర్మ దాదాపుగా కోటి రూపాయలు బాకీ ఉన్నాడు అని ప్రెసిడెంట్ బీఎన్ తివారీ వెల్లడించారు. వర్మ కొన్నాళ్ళుగా చాలా మంది టెక్నీషియన్స్ కు ఇవ్వాల్సిన పారితోషికాలు ఇవ్వడం లేదంటూ తెలిపింది. ఈ విషయంలో ఇప్పటికే వర్మ కు నోటీసులు పంపించడం జరిగిందట. వాటికి రిప్లై ఇవ్వకపోవడం తో లీగల్ గా ప్రొసీడ్ అవబోతున్నారట. వర్మ ఇలా సినీ కార్మికులకు పారితోషికాలను ఇవ్వక పోవడం కరెక్ట్ కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట. మరి వర్మ ఇప్పటికైనా ఈ విషయంలో సానుకూలంగా స్పదిందిస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

Related Posts

త్వరలో రైతులకి తీపికబురు చెప్ప‌నున్న మోడీ సర్కార్ … ఏంటంటే ?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అతి త్వ‌ర‌లో రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌నుందా ? అంటే.. అందుకు అవున‌నే సమాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రైతులకు ఏడాదికి రూ.6వేల‌ను కిసాన్ స‌మ్మాన్ నిధి...

విడుదలకు ముందు అనూహ్యపరిణామాలు .. కరోనా బారిన పడ్డ శశికళ !

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు ఆమె అనుచరులు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లను ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే...

గవర్నర్ తో భేటీ కానున్న నిమ్మగడ్డ.. ఆ వ్యవహారమే కారణమా ?

నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ని కలవనున్నారు. ఆయన కలవడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు చిత్తూరు, కలెక్టర్ ల వ్యవహారం...

ఈ సారి హిట్ పక్కా.. నాగ శౌర్య ‘లక్ష్య’ టీజర్ వైరల్

యంగ్ హీరో నాగ శౌర్య ఓ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందుకోసం రకరకాల పాత్రలను, కథలను ఓకే చేస్తున్నాడు. వరుసగా సినిమాలను లైన్‌లోపెట్టేశాడు. ప్రస్తుతం నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. లక్ష్య...

Latest News