గోవాలో ఆర్జీవీతో ర‌చ్చ చేస్తున్న అరియానా .. ఫోటోలు హ‌ల్‌చ‌ల్‌

బిగ్ బాస్ షో ముందు వ‌ర‌కు అరియానా అంటే ఎవ‌రో పెద్ద‌గా తెలిసేది కాదు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజ‌న్ 4 లో పార్టిసిపేట్ చేసిందో అప్ప‌టి నుండి అరియానా రేంజ్ మారింది. సాధార‌ణ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన అరియానా ఆ త‌ర్వాత రెచ్చిపోయింది. సోహెల్ లాంటి వాడితో కూడా ఢీ అంటే ఢీ అనేలా ఉంది. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తాను అనుకున్న‌ది చెప్పి తీరేది. ఒక్క అవినాష్‌తో కాస్త స్నేహం మెయింటైన్ చేసిన అరియాని మిగతా వారంద‌రితో ఎంత వ‌ర‌కు ఉండాలో అంత వ‌ర‌కే ఉండేది. అరియానా కోపం, ఆవేశం, అభిమానం, ప్రేమ అన్ని ఎక్కువే అని బిగ్ బాస్ షోతో బ‌య‌ట‌ప‌డింది.

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఓ ఇంట‌ర్వ్యూ చేసిన సంద‌ర్భంలో ఆర్జీవీ.. అరియానాతో ఏదో స‌రాదాగా మాట్లాడ‌గా, ఆ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. దీంతో అరియానాకు కూడా కాస్త పాపులారిటీ ద‌క్కింది. బిగ్ బాస్ షోకు ముందు ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌ని అరియానా రామూజీ ద‌య వ‌ల‌న కాస్త పాపుల‌ర్ అయింది. బిగ్ బాస్ షోతో అది రెట్టింపు అయింది. అయితే బిగ్ బాస్ ముగిసిన త‌ర్వాత ఆర్జీవిని క‌ల‌వాల‌ని భావించిన అరియానా ఎట్ట‌కేల‌కు త‌న కోరిక నెరవేర్చుకుంది. రీసెంట్‌గా గోవా వెళ్లిన ఈ అమ్మ‌డు అక్క‌డు రామ్ గోపాల్ వర్మ‌ని క‌లిసి ఫొటోలు దిగింది.

అరియానా ప్ర‌స్తుతం హాలీడే ట్రిప్‌లో భాగంగా గోవాలో ఉంది. త‌న స్నేహితులు శ్రీముఖి, విష్ణు ప్రియ‌, సుశృత్‌తో క‌లిసి గోవాకు వెళ్ళ‌గా అక్క‌డి అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌తో పంచుకుంటుంది. తాజాగా వ‌ర్మ‌ను క‌లిసిన ఫొటోని షేర్ చేసిన అరియానా.. నాకు ఇష్ట‌మైన డైరెక్ట‌ర్‌ను బిగ్ బాస్ త‌ర్వాత క‌లిసాను. త‌న అమూల్య‌మైన స‌మ‌యం నా కోసం కేటాయించినందుకు వ‌ర్మకు కృత‌జ్ఞ‌త‌లు అని పేర్కొంది అరియానా. ఈ రోజు సాయంత్రం బిగ్ బాస్ ఉత్సవం పేరుతో మా టీవీ ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా ఇందులో అవినాష్‌తో క‌లిసి అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది అరియానా. ఈ ఎపిసోడ్ మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్ర‌సారం కానుంది.