“అవతార్ 2” పై రామ్ గోపాల్ వర్మ వింత రివ్యూ.!

ఇప్పుడు ప్రపంచ సినిమా అంతా జపం చేస్తున్న బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ చిత్రం “అవతార్ 2”. దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మైండ్ బ్లాకింగ్ రిలీజ్ అయితే అయ్యింది. ఆల్ టైం రికార్డు స్క్రీన్ లు రికార్డు షోస్ లో ఈ సినిమా రిలీజ్ కాగా..

ఇప్పుడు అయితే ఇండియా లో కూడా ఈ చిత్రానికి మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అన్ని భాషల్లో వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు హిట్ తప్ప ఇంకో మాట చెప్పట్లేదు. అలాగే రివ్యూస్ కూడా చాలానే అలాగే వచ్చాయి.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ సినిమా చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వింతైన రివ్యూ ఇవ్వడం వైరల్ గా మారింది. ఈ సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్ కాగా అంతా నీటి నేపథ్యంలోనే కనిపిస్తుంది.

మరి దీనికి గాను ఇప్పుడు “అవతార్ 2 లో స్నానం చెయ్యడం జరిగింది, ఇది ఒక క్రైమ్ ఇలాంటి అద్భుతమైన విజువల్స్, మైండ్ బెండింగ్ ఏక్షన్ లను లైఫ్ టైం లో ఒక్కసారే చూస్తాం అందుకే క్రైమ్” అన్నట్టుగా వర్మ అయితే తన మార్క్ రివ్యూ ని ఇచ్చేసాడు. దీనితో ఎప్పటిలానే వర్మ మరోసారి స్ట్రైక్ అయ్యాడని అంటున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు అవతార్ 2 హవా వరల్డ్ వైడ్ నడుస్తుంది.