ఇండస్ట్రీ టాక్ : ఈ ఇద్దరు యంగ్ హీరోస్ చరణ్ భారీ ప్రాజెక్ట్స్.!

టాలీవుడ్ గ్లోబల్ పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తన నిర్మాణ సంస్థ లో కొత్త పార్ట్ ని రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్నేహితుడు తో స్టార్ట్ చేసి అయితే వి మెగా ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేశారు.

మరో ఈ బ్యానర్ లో అయితే చిన్న సినిమాలు తో పాటుగా పలు పాన్ ఇండియా సినిమాలు కూడా చేయనుండగా ఇపుడు ఈ లిస్ట్ లో అయితే ఇప్పుడు చరణ్ ఇద్దరు యంగ్ హీరోస్ తో అయితే భారీ చిత్రాలు చేస్తున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో తెలుస్తుంది. కాగా ఈ చిత్రాలు అయితే హీరోలు మొదటగా అఖిల్ అక్కినేనితో కాగా మరో హీరో నిఖిల్ తో అట.

మరి నిఖిల్ తో అయితే ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ ఇద్దరు హీరోస్ ని ప్రస్తుతం లైన్ లో పెట్టుకున్నారట. అలాగే వీరితో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు కూడా కొలాబరేట్ అయినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఫ్యూచర్ లో అయితే వీరి నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. కాగా ఇప్పుడు రామ్ చరణ్ అయితే సెన్సేషనల్ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తుండగా దీనిలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా అయితే దీనిని నిర్మాణం వహిస్తున్నారు.