ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ లో ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ కూడా ఒకటి, మరి ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగ్ మాత్రం అలా కొనసాగుతూనే వస్తుంది.
అయితే ఈ భారీ సినిమా విషయంలో అంతకీ క్లారిటీ రాదు ఇంతకీ క్లారిటీ రాదు సినిమా స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు కూడా దాటిపోయింది. కానీ అసలు సినిమా రిలీస్ ఇప్పుడు అనేది ఇంకా తెలియరాలేదు. పైగా దీనికన్నా తర్వాత స్టార్ట్ అయ్యిన సినిమాలే డేట్స్ కూడా ఇచ్చేస్తూ వచ్చే ఏడాదికి ఫిక్స్ అయ్యిపోయాయి.
దీనితో బాగా మనస్తాపానికి లోనైన రామ్ చరణ్ ఒక అభిమాని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ మూడు రోజుల్లో కానీ గేమ్ చెంజర్ అప్డేట్ కానీ ఇవ్వకపోతే తాను తన ప్రాణాలు తీసుంటాను ఇది చాలా బాధతో చెప్తున్నాను దయచేసి సినిమా రిలీజ్ ఎప్పుడో క్లారిటీ ఇవ్వండి లేదంటే నా చావుకి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ లే కారణం అని వారి ఇద్దరు పేర్లు కూడా ఇందులో మెన్షన్ చేసాడు.
దీనితో ఈ సూసైడ్ నోట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే కొందరు రామ్ చరణ్ అభిమానులు ఈ నిర్ణయాన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. కానీ కొందరు ఇది తెలివి తక్కువ నిర్ణయం అని విమర్శిస్తున్నారు. మరి ఇది మేకర్స్ వరకు సీరియస్ గా వెళ్తుందో లేదో చూడాలి.
We, fans too have some emotions & that crossed the line, so Iam intimating with a gentle reminder for a harsh decision.@SVC_official #GameChanger #RamCharan pic.twitter.com/WawR9KiC2N
— Babu Goud (@RC_MSD_) September 29, 2023