ఖాళీ టైంలో ఆ పనులే చేస్తాను.. రకుల్ ప్రీత్ కామెంట్స్

Rakul Preet Habits In Idle time

రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్‌లో ఉన్నా కూడా అంతే యాక్టివ్‌గా ఉంది. రకుల్‌ను చూస్తే, ఆమె మాటలను బట్టి చూస్తే అసలు కరోనా వచ్చినదానిలా లేనే లేదు. తాజాగా రకుల్ ప్రీత్ తన అభిమానులతో ముచ్చటించింది. క్వారంటైన్‌లో ఉండి బోర్ కొడుతుందో ఏమో గానీ వెరైటీగా అభిమానులకు ఓ చాలెంజ్ విసిరింది.

Rakul Preet Habits In Idle time
Rakul Preet Habits In Idle time

ఎలాంటి ప్రశ్నలైనా అడగండి.. సమాధానాలు చెబుతాను.. ఇలా ఇంత వరకు ట్రై చేయలేదు.. కొత్తగా ట్రై చేస్తాను అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. అలా రకుల్ ఇచ్చిన ఆఫర్‌కు నెటిజన్లు బాగానే స్పందించారు. కొందరు క్రియేటివిటీ జోడించి రకరకాల ప్రశ్నలు సంధించారు. ఫ్యాన్స్ గురించి ఏం చెబుతారు? ఫిట్‌గా ఉండాలన్న స్ఫూర్తి నింపింది ఎవరు? ఎప్పుడు నిద్ర పోతారు.. లేస్తారు అంటూ రకరకాల ప్రశ్నలు అడిగారు.

అందులో ఓ నెటిజన్ మాత్రం వెరైటీ ప్రశ్న అడిగాడు. ఖాళీగా ఉండే సమయాల్లో ఏం చేస్తారంటూ రకుల్‌ను అడిగాడు. దానికి సమాధానంగా రకుల్.. ఫ్యామిలీతో సమయం గడుపుతుంటాను.. ఎక్కువగా సినిమాలు చూస్తుంటాను.. గోల్ఫ్ ఆడతాను.. అంటూ తన అలవాట్లను చెప్పుకొచ్చింది. మొత్తానికి రకుల్ మాత్రం క్వారంటైన్‌లోనూ ఇలా ఫుల్ బిజీగా, హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే నెగెటివ్ కూడా వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది.