రకుల్ రచ్చ.. మాల్దీవుల్లో బికినీ అందాల ప్రదర్శన

Rakul Preet Enjoy In Maldives

రకుల్ ప్రీత్ ఈ మధ్య వార్తలు తెగ హల్చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా డ్రగ్స్ కేసులో రకుల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. రకుల్ పేరు డ్రగ్స్ కేసులో ఉందని ఒకసారి లేదని మరోసారి ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిపై రకుల్ ఢిల్లీ హైకోర్టు వద్ద మొరపెట్టుకుంది. రకుల్ తన పేరును మీడియా దుర్వినియోగం చేస్తోందని వాపోయింది. రకుల్ ఆ సమయంలో హైద్రాబాద్ ఢిల్లీ ముంబై అంటూ చక్కర్లు కొట్టింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తోన్న చిత్రంలో రకుల్ హీరోయిన్ నటిస్తోందన్న సంగతి తెలిసిందే.

Rakul Preet Enjoy In Maldives
Rakul Preet Enjoy In Maldives

డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వచ్చిన సమయంలో ఆమె వికారాబాద్ అడవుల్లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉంది. షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలిగించకుండా రకుల్ తన డ్రగ్స్ కేసును పరిష్కరించుకుంది. హైకోర్టుకు వెళ్లడం, మీడియా మీద ఫిర్యాదు చేయడం వంటి వాటితో రకుల్ ఓ రెండు నెలలు వార్తల్లో వైరల్ అయింది. ఇప్పుడు రకుల్ వీటన్నంటిని కాసేపు పక్కన పెట్టి సేద తీరుతోంది. ప్రస్తుతం రకుల్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. సముద్రంలో ఎంజాయ్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.

బికినీలో రకుల్ చేసే సందడికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం రకుల్ బికినీ ఫోటోలు, వీడియాలు, మాల్దీవుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిన్న అంతా క్రేజీ మూవీలో చాన్స్ కొట్టేసిన వార్తలతో వైరల్ అయింది. అమితాబ్ అజయ్ దేవగణ్ మేడే చిత్రంలో పైలెట్ పాత్రలో రకుల్ కనపడనుంది. నిన్న సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఈ రోజు బికినీతో మరోసారి ట్రెండ్ అవుతోంది.