బాలీవుడ్ లో సుశాంత్ మృతి తర్వాత మొదలైన డ్రగ్స్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఊహించని సినిమా సెలబ్రిటీస్ ఈ వ్యవహారం తో సంబంధాలున్నాయంటూ పలువురి పేర్లు బయటకు రావడంతో అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నిర్మాణ సంస్థలలో భారీ ప్రాజెక్ట్స్ కమిటయిన స్టార్స్ హీరోయిన్స్ ని రియా బయటకు లాగింది. దాంతో కుదురుగా షూటింగ్స్ చేసుకుంటున్న హీరోయిన్స్ ఎన్సీబి అధికారుల ముందు విచారణ కి హాజరు కావాల్సి వచ్చింది.
ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ గా వెలిగిన రకుల్ కి మన్మధుడు 2 ఫ్లాప్ తర్వాత చాలా రోజులకి తెలుగులో ఒక మంచి అవకాశం వచ్చింది. క్రిష్ డైరెక్షన్ లో సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని వికారాబాద్ లో మొదలు పెట్టారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ మొదలై 10 రోజులు కూడా కాకముందే రకుల్ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చి విచారణకి హాజరైంది.
కాగా విచారణ తర్వాత రకుల్ ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదన్న క్లారిటీ రాబోతుందని మళ్ళీ వార్తలు వచ్చాయి. అంతేకాదు మళ్ళీ రకుల్ క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంది. దాంతో దాదాపు అందరూ రకుల్ గురించి సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే ఖచ్చితంగా పిలుపొస్తే మాత్రం మరోసారి విచారణకి హాజరవ్వాల్సి ఉంటుందని తప్పనిసరిగా ముంబై ఫ్లైటెక్కాలని అంటున్నారు.
అయితే రకుల్ నిజంగా దోషి కాదని తాజాగా వెలువడిన ఒక సినిమా ప్రజటన బలాన్ని చేకూర్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న సినిమాని టైటిల్ తో పాటు నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు సైన్ చేసి రకుల్ జెన్యూన్ అని నిరూపించుకుంది.