ఇండియన్ సినిమా దగ్గర సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు అందులోని హిట్ అయ్యిన సూపర్ హీరోలు ఇంకా తక్కువ అని చెప్పాలి. మరి ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిపోయింది. కానీ ఎప్పుడో అసలు సిసలు పాన్ ఇండియా సూపర్ హీరో సినిమా కానీ హీరో కానీ ఎవరైనా ఉన్నారు అంటే అది బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అని చెప్పాలి.
తన తండ్రి రాకేష్ రోషన్ సృష్టించిన “కోయి మిల్ గయా” కి సీక్వెల్ గా చేసిన “క్రిష్” చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. మన ఇండియన్ సినిమాకి ఓ సాలిడ్ సూపర్ హీరోని అందించిన మేకర్స్ ఆ తర్వాత తీసిన “క్రిష్ 3” తో కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇక నెక్స్ట్ క్రిష్ 4 కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా..
దీనిపై రాకేష్ రోషన్ గత కరోనా టైం లో ఓపెన్ అయ్యారు. క్రిష్ 4 మరింత గ్రాండ్ గా భారీ లెవెల్లో ఊహించని కాన్సెప్ట్ తో ఉంటుంది అని తెలిపారు. అయితే ఇది బాగానే ఉంది కానీ మళ్ళీ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఈ సినిమా అప్డేట్ లేదు. అయితే లేటెస్ట్ గా రాకేష్ రోషన్ నేషనల్ మీడియాలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అసలు క్రిష్ 4 ఎందుకు ఆలస్యం అవుతుందో షాకింగ్ కామెంట్స్ చేసారు.
ఈ సినిమా ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఇపుడు జనం ఇంకా థియేటర్స్ కి ముందులా వస్తున్నారా? అంటూ ఇప్పుడు బాలీవుడ్ సినిమా దగ్గర నెలకొన్న పరిస్థితిపై ప్రశ్నించారు. అలాగే ఈ ఇప్పుడు గ్రాఫిక్స్ చాలా హై లెవెల్లో ఉండాలి. హాలీవుడ్ లో చిత్రాలు సినిమాలకి 1000 కోట్లకి పైగా బడ్జెట్ లు పెడుతున్నారు కానీ ఇక్కడ 200 – 300 కోట్లలో చేయాల్సి వస్తుంది.
అప్పుడు ఆడియెన్స్ కోరుకునే క్వాలిటీ ఎక్కడ ఉంటుంది అని అన్నారు. అలా అని 10 ఏక్షన్ సీక్వెన్స్ లు ఉండాల్సిన సినిమాని నాలుగింటితో చేయలేము కదా అని తెలిపారు. అందుకే క్రిష్ 4 ఆలస్యం అవుతుంది అని అన్నీ సెట్ చేసి అయితే సినిమా స్టార్ట్ చేస్తామని రాకేష్ రోషన్ క్లారిటీ ఇచ్చారు.