రాజశేఖర్ మళ్ళీ ఫాం లోకి వచ్చేశాడు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ..!

రాజశేఖర్ కి హీరోగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. యాంగ్రీ యంగ్ మాన్ గా ఇమేజ్ తెచ్చుకున్న డా.రాజశేఖర్ ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాలతోనూ రాజశేఖర్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడ వేగ’ సినిమా చేసి సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చేశారు. ఆ తర్వాత అ!.సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అన్న సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సస్ ని అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అయితే ఈ మధ్య రాజశేఖర్ కరోనా తో ఇబ్బంది పడ్డాడు. చెప్పాలంటే చాలా వరకు ఆరోగ్యం దెబ్బ తిన్నది అన్న వార్తలు కూడా వచ్చాయి. కాని మళ్ళీ కోలుకొని సాధారణ పరిస్థితికి చేరుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్ మళ్ళీ రీ ఛార్జ్ అయ్యారు. పర్ఫెక్ట్ డైట్ తో డాక్టర్స్ సలహాలతో మళ్ళీ డబుల్ ఎనర్జీతో సినిమాలు చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా కథలు వింటున్నారు. అయితే రీసెంట్ గా జీవిత దర్శకత్వంలోనే రాజశేఖర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.

ఇంకా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ రాకుండానే ఇప్పుడు మరో న్యూస్ బయటకి వచ్చింది. రాజశేఖర్ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన జోసెఫ్ సినిమా ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. లలిత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఇక ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే ఈ సినిమాని అధికారకంగా ప్రకటించి సెట్స్ మీదకి తీసుకు రానున్నారని తెలుస్తోంది.