ఆ సీనియర్ హీరో తో రాజమౌళి నెక్స్ట్ సినిమా?

ఇరవైఏళ్ళ క్రితం టాలీవుడ్ లో కి కొత్త డైరెక్టర్స్ చాలా మంది వచ్చారు. వైవియస్ చౌదరి, వివి వినాయక్, పూరి జగన్నాధ్, రాజమౌళి. మొదట్లో వినాయక్, పూరి రాజమౌళి కంటే టాప్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళడందరూ ఫేడ్ అవుట్ అయిపోయారు. కానీ రాజమౌళి మాత్రం తన స్టార్డం ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా గా మారిన రాజమౌళి సినిమాలో నటించడానికి స్టార్ హీరోస్ అందరూ ఎదురుచూస్తున్నారు.

కెరీర్ మొదట్లో రాజమౌళి తనకు ఫేవరెట్ హీరో నాగార్జున అని తనతో ఎప్పటికైనా ఒక సినిమా చేస్తానని అన్నాడు. కానీ అది జరగలేదు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు సినిమాలో నాగార్జున ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపైనా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

మరో వైపు మహేష్ బాబు సినిమాలో గెస్ట్ రోల్ కాదు రాజమౌళి నాగార్జున హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఓ సక్సెస్ మీట్ లో నాగార్జునని రాజమౌళితో సినిమా ఎప్పుడు చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

దీనికి నాగార్జున మాట్లాడుతూ.. రాజమౌళితో సినిమా చేసే సమయం వస్తే అది సాధ్యమవుతుంది. నాతో సినిమా తీయమని రాజమౌళిని అప్పుడప్పుడు అడుగుతుంటూనే ఉంటాను. కానీ ప్రతిసారీ ఆయన చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటారు. రాజమౌళి కథని నమ్మే దర్శకుడు. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక దానికి తగ్గ నటుల్ని వెతుక్కుంటారు. మరి ఆయన కథలకి నేనెప్పుడూ సరిపోతానో, ఆ సమయం వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే  అని చెప్పారు. ఇండైరెక్ట్ గా రాజమౌళి ఓకే అంటే సినిమా చేయడానికి నాగార్జున రెడీగా ఉన్నాడని చెప్పేశారు. అవసరమైతే తానే నిర్మాతగా కూడా ఉండటానికి రెడీగా ఉన్నాడు నాగ్.