పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇపుడు ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయిలో అయితే మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ చిత్రమే దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మాసివ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ “కల్కి ఎడి2898” కాగా ఈ సినిమా గ్లింప్స్ తర్వాత అయితే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది.
దీనితో హాలీవుడ్ లో కూడా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా మాట్లాడుకోగా ఈ సినిమాలో ఇప్పటికే సెన్సేషనల్ తారాగణం ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఇప్పుడు లేటెస్ట్ గా దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి పేరు కూడా వినిపిస్తుంది. కాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ సినిమాలో రాజమౌళి కూడా ఓ క్యామియో పాత్రలో నటిస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇది ఎంత ఇంట్రస్టింగ్ గా ఉంది అంటే ఈ సినిమాలో భవిష్యత్తు కాలం కూడా చూపిస్తారన్న సంగతి తెలిసిందే. మరి ఈ భవిష్యత్తులో రాజమౌళి చేసే సినిమా “మహాభారతం” షూటింగ్ కోసం దాని ప్రస్తావన కూడా ఉంటుంది అని వినిపిస్తుంది. ఇది వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండగా నిజం అయితే ఫ్యాన్స్ కి మాత్రం మామూలు ట్రీట్ ఉండదు అని చెప్పాలి.
కాగా ఈ చిత్రంలో అమితాబ్, ఉలగనయగన్ కమల్ హాసన్, దీపికా పదుకొనె అలాగే దిశా పటాని తదితర భారీ తారాగణం నటిస్తుండగా అశ్వని దత్ నిర్మాణం వహిస్తున్నారు.