భయం వేసినప్పుడల్లా సీతారామశాస్త్రిగారి చెప్పిన పదాలు పాడుకుంటూ పడుకుంటా: రాజమౌళి

సినీ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చెందడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. గత మూడున్నర దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో ఎన్నో సేవలు అందించిన ఆయన ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఇలా ప్రముఖ గేయ రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిచెందడంతో పలువురు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సిరివెన్నెల మృతి పై స్పందిస్తూ తనతో ఉన్న అనుభవం గురించి పంచుకున్నారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ 1996లో మేము తీసిన అర్థాంగి అనే చిత్రం ద్వారా సంపాదించుకున్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను. ఆ సమయంలో వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలని తెలియని ఆందోళన పరిస్థితులలో ఉన్న సమయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నా భుజం తట్టి నాకు ధైర్యాన్ని నూరిపోశారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. అన్న సీతారామశాస్త్రిగారి పదాలు తనకు ఎంతో ధైర్యాన్ని నూరిపోసాయని చెప్పారు.ఇప్పటికి కూడా తన జీవితం గురించి తనకు భయం కలిగినప్పుడు సీతారామశాస్త్రి గారు చెప్పిన ఈ పదాలను గుర్తు చేసుకుంటూ పడుకుంటే తనకుఎంతో ధైర్యం వస్తుందని ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి చెప్పిన పదాలను గుర్తు చేసుకుని రాజమౌళి ఎమోషనల్ అయ్యారు.

ఇక అప్పటికి సీతారామశాస్త్రి గారితో నాకు పరిచయం చాలా తక్కువ అని చెప్పిన రాజమౌళి డిసెంబర్ 31వ తేదీ తారీకు రాత్రి 10 గంటల సమయంలో ఆయన ఇంటికి వెళ్లి ఒక కొత్త నోట్ బుక్ తన చేతిలో పెట్టి తనకు ఇవ్వమని చెప్పాను. ఆ సమయంలో తన పాట రాసి సంతకం చేసి ఇచ్చారు.ఈ పాటను జనవరి ఒకటో తేదీ తన తండ్రికి గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల తన కళ్ళలో కలిగిన ఆనందం ఎప్పటికీ మరిచిపోలేని ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.