Shivani : మిస్ ఇండియా పోటీలో రాజశేఖర్ కూతురు…. పోటిలో 8వ స్థానంలో అమ్మడు, ఆల్ ది బెస్ట్ చెబుతున్న నెటిజన్స్…!

Shivani : టాలీవుడ్ లో వారసులకు కొదవలేదు. హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. ఇక హీరోల కూతుర్లు హీరోయిన్లుగా రావడం అరుదు కానీ కొంతమంది అలా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక ఈ లిస్ట్ లో నాగబాబు కూతురు నిహరిక కొణిదెల, రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక ఉంటారు. ఇక రాజశేఖర్ కూతుర్లు దొరసాని’ సినిమాతో ఆయన చిన్న కూతురు శివాత్మిక ఎంట్రీ ఇస్తే ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది శివానీ రాజశేఖర్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అయితే రాజశేఖర్ పెద్ద కూతురి కంటే చిన్న కూతురు ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆమె నటించిన చిత్రాలలో కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. అలా అడవి శేషు తో చేసిన ఓ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే శివానికి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె షేర్ చేసే ఫోటోలు, ఫోటో షూట్ లను బట్టి చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు తాజాగా శివాని ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని శివాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించేసింది.

ఇక అమ్మడు ఫోటోలు చూస్తుంటే ఈ పోటీలో ఏపీ నుండి తాను 8వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇక సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాక నెటిజన్ల నుండి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ ఫోటోలకు స్పందిస్తూ చెల్లెలు శివాత్మిక హీరోయిన్ ఇషా రెబ్బ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక శివాని మాత్రం ఈ పోటీలో విన్నర్ అయితే ఆమె దశ తిరిగేట్టు కనిపిస్తోంది. మరి ఆమె అందం మిస్ ఇండియా పోటిల్లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి.