అంబాజీపేట మ్యారేజి బ్యాండు…!

కలర్‌ఫొటో ఫేం సుహాస్‌ కాంపౌండ్‌ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచుతున్నాయి. ఈ చిత్రం నుంచి రిలీజ్‌ చేసిన గుమ్మా సాంగ్‌ కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది.

కాగా ఈ సినిమా రిలీజ్‌ అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చేసింది సుహాస్‌ టీం. మూవీని వచ్చే ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఈ లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. హీరోహీరోయిన్ల మధ్య సరదా లవ్‌ ట్రాక్‌తో సాగుతున్న గుమ్మా సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ ను ఇంప్రెస్‌ చేస్తుండగా.. మేకింగ్‌ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సుహాస్‌ టీజర్‌లో ఓ వైపు హెయిర్‌ సెలూన్‌ నడిపిస్తూ.. మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేస్తూ.. శివానీతో లవ్‌లో పడే యువకుడిగా ఫన్‌, సీరియస్‌గా ఎంటర్‌టైన్‌ చేయనున్నట్టు తెలియజేశాడు డైరెక్టర్‌.

హీరోహీరోయిన్ల ఫన్నీ లవ్‌ ట్రాక్‌, ఇతర సీరియస్‌ అంశాల చుట్టూ తిరిగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు హింట్‌ ఇచ్చేశాడు. సుహాస్‌ అండ్‌ మ్యారేజ్‌ బ్యాండ్‌ టీం సాగించే ఫన్‌ రైడ్‌తో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.