నా గుండెను గులాబి చేసి నీ గుమ్మం ముందు పెడతా.. ఆశుకి ప్రపోజ్ చేసిన ఎక్స్ప్రెస్ హరి..!

బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో చాలామంది లవ్ ట్రాక్ ల వల్ల ఫేమస్ అయ్యారు. మొదట ఈ సాంప్రదాయాన్ని బుల్లితెరకు పరిచయం చేసింది మాత్రం జబర్దస్త్ . ఈ జబర్దస్త్ ద్వారా సుధీర్, రష్మీ జంట బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత వర్ష, ఇమాన్యుల్ జంట బాగా పాపులర్ అయ్యారు. ఇలా ఫేమస్ అవటంతో వీరు నిజంగా ప్రేమించుకున్నారని చాలామంది అనుకున్నారు. కానీ వీరు కూడా సుధీర్, రష్మి లాగే కేవలం టీఆర్పీ కోసం ఇలా చేస్తున్నారు. ఇక ఇప్పుడు మా టీవిలో కూడా ఇలాంటి లవ్ ట్రాక్ లు మొదలయ్యాయి. ఇటీవల ఆశు రెడ్డి, ఎక్స్ప్రెస్ హరి మద్య లవ్ ట్రాక్ మొదలైంది. వీరిద్దరూ స్టేజ్ మీద చాలా క్లోజ్ గా ఉండటమే కాకుండా ఆశు రెడ్డి ఏకంగా హరికి ఒక కాస్ట్లీ బైక్ బహుమతిగా ఇచ్చింది.

అందువల్ల ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కూడా జంటగా బాగా ఫేమస్ అవుతున్నారు. అయితే ఆశు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమ వ్యవహారం నడిపింది. ఆ తర్వాత అఖిల్ తో కూడా చాలా సన్నిహితంగా ఉంది. ఇక ఇప్పుడు ఎక్స్ప్రెస్ హరితో ప్రేమ అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సండేస్ షోలో పార్టీ చేద్దాం పుష్ప పార్ట్ 2 లో సందడి చేశారు. వీరిద్దరూ ఒక అందమైన లవ్ సాంగ్ కి డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఎక్స్ప్రెస్ హరి ఆశు రెడ్డికి తన ప్రేమని వ్యక్తపరిచాడు.

ఈ క్రమంలో ఎక్స్ప్రెస్ హరి మాట్లాడుతూ.. అందరూ నన్ను ఎప్పుడు ఆశు దగ్గర నుండి తీసుకోవడమే తప్ప తనకు ఏమీ ఇవ్వవా? అని అడుగుతున్నారు. నేను నీకు ఏమి ఇవ్వగలను నా గుండెని గులాబీలా చేసి నీ గుమ్మ ముందు పెట్టడం తప్ప. నువ్వు ఎప్పటికీ నా దేవతవి అంటూ ఆశుకి ప్రపోజ్ చేసాడు. అయితే హరి ఆశు రెడ్డి పేరుని గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా ప్రపోజ్ చేయటంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కొందరు అంటుంటే.. టిఆర్పి కోసమే వీళ్లు ఇలా చేస్తున్నారు అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. మొత్తానికి లవ్ ట్రాక్ తో ఈ జంట కూడా బాగా ఫేమస్ అయ్యారు.