క్రేజ్‌ను అలా వాడేస్తున్నారు.. ‘బొమ్మ అదిరింది’లో రఘు మాస్టర్ జంట

Raghu Master And Pranavi In Bomma Adirindhi

బొమ్మ అదిరింది షోలో ప్రతీవారం ఓ స్పెషల్ గెస్ట్‌ను తీసుకొస్తున్నారు. అదిరింది షోను బొమ్మ అదిరిందిగా మార్చి రీఎంట్రీ ఇచ్చారు. మొదటి ఎపిసోడ్‌తోనే రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించేశారు. వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్ ఓ రేంజ్‌లో వివాదంగా మారింది. దెబ్బకు దిగొచ్చి సారీ చెప్పాల్సి వచ్చింది. అలా మొదటి ఎపిసోడ్‌తోనే వైరల్ అయిన బొమ్మ అదిరింది షోలో ప్రతీవారం ఓ స్పెషల్ గెస్ట్ ఎంట్రీ వస్తున్నాడు.

Raghu Master And Pranavi In Bomma Adirindhi
Raghu Master And Pranavi In Bomma Adirindhi

మొదటి రెండు ఎపిసోడ్‌లకు సుమ, అలీలు స్పెషల్ గెస్ట్‌లుగా విచ్చేశారు. ఆ తరువాత రాహుల్ రామకృష్ణ, శివ శంకర్ మాస్టర్‌లు వచ్చారు. ఈ ఇద్దరూ వచ్చి స్కిట్‌లలో పాలు పంచుకున్నారు. ఆ ఇద్దరూ కూడా బాగానే ఇన్వాల్వ్ అవుతూ స్కిట్స్ పేలేలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా శివ శంకర్ మాస్టర్‌లు చేసిన స్కిట్, వేసిన పంచ్‌లు బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా వచ్చే వారంలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది.

ఈ ఆదివారం షోలో రఘు మాస్టర్, ప్రణవి జంట విచ్చేశారు. ఇలా వీరికి ఉన్న క్రేజ్ బొమ్మ అదిరింది టీం భలే వాడేశారు. ఈ ఇద్దరి లవ్ స్టోరీని చెప్పించి ప్రోమోలో హైప్ పెంచేశారు. ఇక చివరగా జానీ మాస్టర్ రఘు మాస్టర్ కలిసి స్టెప్పులు వేయడం ఒకెత్తు అయితే డ్యాన్సర్ పండు వేసిన స్టెప్పులు బాగానే వైరల్ అయ్యాయి.