గత వారం రాధే శ్యామ్ మేకర్స్ స్వచ్ఛందంగా అనేక సన్నివేశాలను కత్తిరించాలని నిర్ణయించుకున్నట్టు లీకులు అందాయి. మరింత బెటర్ వెర్షన్ కోసం ఈ చిత్రానికి కొన్ని సన్నివేశాలను కూడా జోడించారని తెలిసింది. సిబిఎఫ్ సికి సమర్పించిన స్వచ్ఛంద సవరణ జాబితా ప్రకారం మొత్తం 56 సవరణలు జరిగాయనేది టాక్.
వీటిలో దాదాపు 49 మేకర్స్ చేసిన కట్స్. కొన్ని సన్నివేశాలు కేవలం 2 లేదా 5 లేదా 11 సెకన్లు మాత్రమే కత్తిరించారు. రెండు సీక్వెన్స్ ల నుంచి 2 నిమిషాలు.. 5 నిమిషాలు కూడా కత్తిరించారట. కాగా 7 చోట్ల చేర్పులు జరిగాయి. 8 లేదా 10 సెకన్ల నిడివి ఉన్న కొన్ని షాట్ లతో పాటు 5.30 నిమిషాలు… 2.55 నిమిషాలు మరియు 2.16 సెకన్ల నిడివిగల సన్నివేశాలు సినిమాలో అలరిస్తాయని తెలుస్తోంది.
ఎడిట్ రూమ్ లో ఇంతటి భారీ కసరత్తు ద్వారా మూవీపై గ్రిప్ అమాంతం పెంచారని టాక్ ఉంది. రాధే శ్యామ్ ట్రిమ్మింగ్ లో 23 నిమిషాల ఫుటేజీని తొలగించారట. మొత్తం 11 నిమిషాల సన్నివేశాలను జోడించారు. రాధే శ్యామ్ చివరి వ్యవధి ఇప్పుడు 138 నిమిషాలు. ఇప్పుడు ఈ సినిమా నిడివి 2 గంటల 18 నిమిషాలు. సోర్సెస్ ప్రకారం.. హిందీ వెర్షన్‌లో కూడా ఇలాంటి మార్పులు చేసారని తెలిసింది.