ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రానున్న పలు బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ సీక్వెల్ చిత్రాల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా నిన్న సాయంత్రం సమయంలో ఈ సినిమా యూనిట్ కి ఓ ఊహించని షాక్ అయితే తగిలింది.
కాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పక్కనే కనిపించే నటుడు జగదీష్ ప్రతాప్ ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో షాకింగ్ గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న తాను పుష్ప 2 నుంచి రావాల్సి వచ్చింది. దీనితో పుష్ప 2 లో తన సీన్స్ అన్ని ఆగిపోయాయి.
కాగా ఇప్పుడు ఈ షూట్ విషయంలో సినీ వర్గాల్లో అప్డేట్ వినిపిస్తుంది. తాను పుష్ప 2 కి చేయాల్సిన సీన్స్ చాలా ఉన్నాయట. ఆ సీన్స్ అన్నీ మేకర్స్ రానున్న రోజుల్లో ప్లాన్ చేయగా ఇపుడు ఈ అరెస్ట్ తో షాకయ్యారు. దీనితో ఈ సీన్స్ ని జగదీష్ జైలు నుంచి బైలు మీద బయటకి వస్తే అప్పుడు తెరకెక్కిస్తారని అంటున్నారు.
దీనితో అప్పటివరకు అయితే ఆ సంబంధిత సీన్స్ ఏవి తెరకెక్కవు అని చెప్పాలి. మరి జగదీష్ బయటకి వస్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. మరి ఈ కేసు విషయంలో ఏమవుతుందో చూడాల్సిందే.