నేషన్ వైడ్ మరో వండర్ క్రియేట్ చేసిన “పుష్ప 2”

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ గా మారిన సీక్వెల్స్ హిట్స్ లో బాహుబలి, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు తర్వాత బాలీవుడ్ మార్కెట్ లో 40 కోట్ల వసూళ్లతో సంచలనం రేపిన మరో సీక్వెల్ చిత్రం “గదర్ 2”. బాలీవుడ్ ఎప్పుడో హిట్ అయ్యిన చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం 40 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము లేపింది.

దీనితో మళ్ళీ బాలీవుడ్ లో 40 కోట్ల వసూళ్లతో ఓపెనింగ్స్ సాధించే సీక్వెల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది పుష్ప 2 అనే టాక్ తో లెక్క మొదలవుతుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ దర్శకుడు సుకుమార్ లు సెట్ చేసిన బెంచ్ మార్క్ ఫస్ట్ లుక్ తో భారీగా హైప్ ని తెచ్చుకోగా సినిమా ఫస్ట్ లుక్ సహా అప్పుడు వచ్చిన సినిమా టీజర్ లు వండర్ రికార్డ్స్ సెట్ చేసాయి.

దీనితో పుష్ప 2 సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకోగా పుష్ప 2 ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా నేషనల్ గా ఓ భారీ రికార్డు సెట్ చేసినట్టుగా చిత్ర యూనిట్ చెప్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ లుక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 7 మిలియన్ లైక్స్ సాధించింది.

దీనితో ఇండియా లోనే ఏ ఇండస్ట్రీ నుంచి కూడా ఓ ఫస్ట్ లుక్ కి ఇంత మేర రికార్డు రావడం ఇదే మొదటి సారి అయ్యింది. దీనితో ఈ సెన్సేషనల్ రికార్డు ఉన్న హీరోగా అల్లు అర్జున్ నిలవగా పుష్ప 2 కూడా మొదటి చిత్రంగా అయితే నిలిచింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.