ఛార్మి నటిగా అందరికీ సుపరిచితమే. ఛార్మి 1986లో పంజాబ్ లో జన్మించారు. ఆమెను ముంబైలో ఒక దర్శకుడు చూసి 2001 లో నీ తోడు కావాలి అనే సినిమాలో మొదట అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు.2002లో కాదల్ కిసు కిసు అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా విజయవంతమై తమిళంలో పలు అవకాశాలు వచ్చాయి.
కృష్ణవంశీ గారు శ్రీ ఆంజనేయం సినిమా ద్వారా మళ్ళీ తెలుగు తిరిగి పరిచయం చేశారు. దాని తర్వాత నీకే మనసిచ్చాను సినిమా. ఈ రెండు సినిమాలు పరాజయం పాలైన ఆమె నటనకు గుర్తింపు మాత్రం లభించింది. అడపా దడపా వచ్చే అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్న ఛార్మికి మంత్ర సినిమాతో మంచి విజయం, పేరు ప్రతిష్టలు వచ్చాయి. ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
అసలు విషయానికి వస్తే పూరి జగన్నాథ్ కు ఛార్మి కాస్త సన్నిహితంగా ఉండడం చూసి కొన్ని పుకార్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఫైటర్ సినిమా మొదలైనప్పటి నుంచి గుసగుసలు వినపడుతున్నాయి. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మి నటించిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ సినిమా పరాజయం కావడంతో హీరోయిన్ గా తన కెరీర్ ముగిసిందని భావించిన ఛార్మి, పూరి జగన్నాథ్ సినిమాలలో కో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ అనే సంస్థను ప్రారంభించి, పూరీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ముందుకు కొనసాగుతుంది. పూరి టాకీస్, పూరి కనెక్ట్, బ్యానర్ లు వీరిద్దరూ కలిసి చూసుకుంటున్నారు. 33 సంవత్సరాల చార్మి ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై పూరితో డేటింగ్ లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరూ మొదట్లో నిర్మించిన సినిమాలు పరాజయం కావడం. తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ నెలకొంది. ఇక ఛార్మి పూరితో సన్నిహితంగా ఉండడం తన భార్య లావణ్య కు నచ్చలేదు. ఛార్మిని కలిసి త్వరగా పెళ్లి చేసుకోమని పరోక్షంగా హెచ్చరించింది. ఛార్మికి సమీప బంధువు తో పెళ్లి నిశ్చయం అయినట్లు తెలుసుకున్న లావణ్య త్వరగా పెళ్లి చేసుకోమని ఛార్మికి సలహా ఇచ్చింది. అయితే ఇది ఇప్పుడు కాదు ఒకప్పుడు అలా వార్నింగ్ ఇచ్చిందని తెలిసింది.