మైక్ టైసన్ ను జంతువు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పూరి జగన్నాథ్…?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇడియట్, పోకిరి, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఆగస్టు 25వ తేదీన విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. తాజాగా టైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బృందం వరంగల్ లో సందడి చేసింది. ఇటీవల హన్మకొండ లో టైగర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ తాను చేసే పని పట్ల ఎంతో శ్రద్ధగా ఉంటాడని వెల్లడించాడు. ఈ సినిమా ప్రారంభించిన మొదటిలో విజయ్ తండ్రి తనని నా కొడుకులా చూడమని చెప్పాడు.. కానీ విజయ్ నాకు తండ్రిలా మారి అన్ని కష్టాలలో తోడుగా నిలిచాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ మైక్ టైసన్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో మైక్ టైసన్ ఒక ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో మైక్ టైసన్ నటించటానికి ముఖ్య కారణం చార్మి. ఛార్మి సలహా వళ్ళ మైక్ టైసన్ ని సంప్రదించామని పూరీ వెల్లడించాడు. మైక్ టైసన్ కోసం అమెరికాలో భారీ సెట్ వేసి అతడు వస్తాడా? లేదా? అని ఎదురు చూస్తున్న సమయంలో మైక్ టైసన్ కారు నుండి దిగగానే ఉన్న టెన్షన్ మొత్తం పొయింది అంటూ వెల్లడించాడు. నేను విజయ్ దేవరకొండ మైక్ టైసన్ పక్కన కూర్చుంటే మా కళ్లకు ఒక ఏనుగు , గుర్రం లాంటి జంతువుల లా కనిపించేవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటె అతని శరీరం అంత భారీగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా మైక్ టైసన్ గురించి పూరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.