Puri Jagannath : జన గణ మన ఎప్పుడు ఉంటుందో చెప్పేసిన పూరి జగన్నాథ్..!

Puri Jagannath : పూరీ జగన్నాథ్ సినిమాలు హీరోలకు ఒక కొత్త ఇమేజ్ తెచ్చిపెడతాయి. ఇక పూరీ కి ఉన్న మరో ప్రత్యేకత తన సినిమాలను ఎక్కువ రోజులు తీయడు చాలా తక్కువ టైములో తీసి నిర్మాతను గట్టేక్కిస్తాడు.కానీ కరోనా వల్ల లైగర్ సినిమా ఇంకా విడుదలవ్వలేదు. లైగర్ సినిమాను విజయ్ దేవరకొండతో తీస్తున్నాడు చిత్రానికి సంబందించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక వెంటనే విజయ్ తో మరో సినిమా చేయబోతున్నాడు పూరీ జగన్నాథ్.

లైగర్ కూడా పాన్ ఇండియా సినిమా. రిలీజ్‌కి ఇంకా సమయం ఉంది . ఈలోగా మ‌రో పాన్ ఇండియా సినిమా ప్ర‌క‌టించేశాడు. అంతేనా? రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేశాడు. 2023 ఆగ‌స్టు 3న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని కొబ్బ‌రి కాయ కొట్టేట‌ప్పుడే ఫిక్స్ చేసేశాడు. సినిమా మొద‌లెట్టిన రోజే, రిలీజ్ డేట్ చెప్పేయ‌డం పూరి స్టైల్‌. ఈసారీ అదే జ‌రిగింది. కాక‌పోతే… సినిమా మేకింగ్‌లో చాలా మార్పులొస్తున్నాయి. కాల్షీట్ల స‌మ‌స్య‌.. ఉండ‌నే ఉంది. పాన్ ఇండియా సినిమా అంటే.. స్టార్ల‌తో వ్య‌వ‌హారం.

అయిన‌ప్ప‌టికీ.. రిలీజ్ డేట్ చెప్పేసి తొడ‌గొట్టాడంటే.. మామూలు విష‌యం కాదు. ఇది వ‌ర‌కు బాలీవుడ్ లో ఈ ఫార్ములా ఉండేది. వాళ్లు ముందే విడుదల తేదిని ప్రకటించే వాళ్లు. కానీ.. వాళ్లు సైతం.. త‌మ సినిమాల్ని అనుకొన్న స‌మ‌యానికి విడుద‌ల చేయ‌డం లేదు. ఈ విష‌యంలో.. వాళ్ల‌నే దాటేశాడు పూరి. పాన్ ఇండియా పేరు చెప్పి ఏళ్ల త‌ర‌బ‌డి సినిమాలు తీయ‌డం, హీరోల్ని రెండు మూడేళ్ల పాటు లాక్ చేసేయ‌డం.. ఇలాంటి ప‌రిస్థితుల్లో పూరి ఫ‌టాఫ‌ట్ మ‌ని సినిమాలు తీయ‌డం.. నిజంగా గొప్ప విష‌య‌మే.