“సలార్” సస్పెన్స్..నిర్మాతలు కొత్తగా ఏం చెప్తున్నారంటే 

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హైప్ లో ఉన్న పలు చిత్రాల్లో పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి ప్రభాస్ హీరోగా దర్శకుడు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మాసివ్ డ్రామా “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. మరి పలు కారణాల చేత ఈ సెప్టెంబర్ రిలీజ్ ని వాయిదా వేసుకున్న ఈ చిత్రం చాలా చిత్రాలకి రిలీఫ్ ని ఇచ్చింది.

కాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రిలీజ్ ఎప్పుడు అనేది ఎవరూ కూడా ఎటు తేల్చలేపోతున్నారు. మెయిన్ గా చిత్ర యూనిట్ లోనే సరైన క్లారిటీ లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా సలార్ నిర్మాతలు ఏది తేల్చి చెప్పలేకపోతున్నారట.

సినిమా ఫలానా టైం ని ఒకటి చెప్పి మారుస్తున్నారట. అలా ఇప్పుడు తాజాగా తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ రేస్ లోకివెళ్లేలా ఉందని అప్పటికి రెడీ అవ్వండని చెప్తున్నారట. దీనితో అసలు ఏమీ అర్ధం కాక అంతా తలలు పట్టుకుంటున్నారట.

ఇప్పటికే భారీ ఆఫర్స్ ఇచ్చిన వారికి నెమ్మదిగా సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. పోనీ ఏదైనా కరెక్ట్ కమిట్మెంట్ ఇచ్చినా బాగుణ్ణు అనుకుంటున్నారట. మొత్తానికి అయితే సలార్ మేకర్స్ ఈ రకంగా సస్పెన్స్ లో పెట్టేసారు. కాగా ఈ చిత్రంలో దర్శకుడు నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.