ఓ స్టార్ ప్రొడ్యూసర్.. ఓ స్టార్ హీరో చుట్టూ తెగ తిరుగుతున్నాడట. ఆ స్టార్ హీరో డేట్స్ మాత్రం ఇవ్వడం లేదట. గతంలో ఆయనే నా అభిమాన హీరో అంటూ తిరిగాడు.
అదే అభిమానంతో ఓ సినిమా కూడా తీశాడు. ఆ సినిమా టైమ్‌లో అనుకోకుండా వచ్చిన వివాదంతో ఆ హీరో మీద అభిమానం పక్కన పెట్టేసినట్లుగా వ్యవహరించాడు.
అది తెలిసిన ఆ స్టార్ హీరో తన చుట్టు పక్కలకు రానీయకుండా అవైడ్ చేస్తున్నాడట. దాంతో, తన తప్పేం లేదంటూ ఆ నిర్మాత.. ఆ హీరోకి సంకేతాలు పంపిస్తున్నాడట సన్నిహితుల ద్వారా.
అయినా కానీ, ఆ హీరో దగ్గరకు రానీయడం లేదట. ఎలాగైనా ఆ హీరోతో ఇంకో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నాడట సదరు నిర్మాత.
ఇదిలా వుంటే, ఆ స్టార్ హీరో ఇప్పుడేమంత బిజీగా లేడు. ఎంత కిందా మీదా పడినా డేట్స్ ఇచ్చే పరిస్థితే లేదు ఆ స్టార్ హీరోకి.
ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేయాలి. ఆ సినిమాలు కమిట్ అయిన ఆ సినిమాలు పూర్తి చేసేందుకే ఆ హీరో తలమునకలవున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ నిర్మాతకు అవకాశం దొరికేదెలా.!