సొంత గ్రామానికి 50 లక్షల విరాళం ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అభినందించిన మాజీ మంత్రి?

Prashanth Neel taking reasonable remuneration

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకొని కేజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తెలుగు వ్యక్తి అని తెలియడంతో ఎంతోమంది తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈయన మడకశిర నియోజకవర్గానికి చెందిన నీలకంఠాపురం గ్రామానికి చెందినవారు.అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు కావడంతో ఈయన రఘువీరారెడ్డికి స్వయాన కొడుకు అవుతారు.

ఇకపోతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈయన నీలకంఠాపురం గ్రామాన్ని సందర్శించారు.స్వాతంత్ర దినోత్సవం రోజున తన తండ్రి సుభాష్ రెడ్డి జయంతి కావడంతో ఈయన నీలకంఠాపురంలో ఉన్నటువంటి తన తండ్రి ఘాట్ సందర్శించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే జన్మించారు. ఈ క్రమంలోని ఈనెల ఆగస్టు 15తో ఆయన 75 వ జయంతి వేడుకలను జరిపారు. ఈ క్రమంలోనే నీలకంఠాపురం గ్రామానికి వచ్చిన ఈయన తన తండ్రి జయంతి సందర్భంగా అదే గ్రామంలో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఏకంగా 50 లక్షల విరాళం ప్రకటించారు.

ఈ విషయాన్ని మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇక సొంత గ్రామం కోసం 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడంతో ఈయనపై నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో సలార్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తో మరో సినిమా చేయనున్నారు.