ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్…. నిరుత్సాహంలో ఫ్యాన్స్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సలార్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని కూడా కేజిఎఫ్ సినిమా నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రేక్షకుల కోరిక మేరకు నిర్మాణ సంస్థ ఈ సినిమా అప్డేట్ విడుదల చేశారు.ఈ సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు.ఇలా ఈ సినిమా విడుదల తేదీ వెల్లడించినప్పటికీ అభిమానులలో కాస్త నిరుత్సాహం కనిపించిందని చెప్పాలి.ఈ సినిమా చూడాలంటే మరో ఏడాది పాటు ఎదురు చూడాలి అనే కొంత పాటి నిరుత్సాహం అభిమానులలో కనిపించింది.

ఇక ఈ సినిమా విడుదల తేదీన ప్రకటించడంతో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ ఎంతో డిఫరెంట్ లుక్ లో కనిపించారు. రక్తపు ఆయుధాన్ని చేతిలో పట్టుకున్న ప్రభాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడంతో ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొట్టమొదటిసారిగా శృతిహాసన్ సందడి చేయనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.