KGF 2: యష్ లో కొత్త కోణాన్ని బయటపెట్టిన ప్రశాంత్ నీల్…!

KGF 2:యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ కి రెడీ అవుతోంది. యష్ నటించిన కేజిఎఫ్ ఎంత భారీ విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే, సీక్వెల్ గా వస్తున్న కేజిఎఫ్ 2 మీద కూడా అంచనాలు అంతే రేంజ్ లో ఉన్నాయి. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగానే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అప్పుడే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ట్రైలర్ లో రాఖీ బాయ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ట్రైలర్‌ ప్రారంభంలో యశ్‌ ‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌.. బట్‌.. వైలెన్స్‌ లైక్స్‌ మీ’ అంటూ చెప్పిన ఈ పవర్‌ ఫుల్ డైలాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ యశ్‌ గురించిన ఆసక్తిర విషయం చెప్పాడు. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ.. ఈ మూవీకి ఓ స్టార్‌ హీరో కొన్ని డైలాగ్స్‌ రాశాడంటూ సీక్రెట్‌ రివీల్‌ చేశాడు. ఆయన ఎవరో కాదని కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ అని చెప్పాడు. ప్రస్తుతం ఎంతో మందిని ఆకట్టుకుంటూ వైరల్‌గా మారిన ‘వైలెన్స్‌’ డైలాగ్‌ స్వయంగా యశ్‌(రాఖీ భాయ్‌) రాశాడంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇది తెలిసి ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

కాగా ఈ ట్రైలర్‌ విడుదలైన 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్‌ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్‌ వ్యూస్‌ రాగా.. తెలుగులో 20M, హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8M వ్యూస్‌ వచ్చాయి. ‘రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్‌ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు’ అంటూ మేకర్స్‌ బుధవారం ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.మూవీ కొసం యశ్‌ మరిన్ని డైలాగ్స్‌ కూడా రాసినట్లు ప్రశాంత్‌ వర్మ తెలిపాడు.