తన సినిమాలు ఎందుకలా ఉంటాయో రివీల్ చేసిన నీల్.. 

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్న కొందరు మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో మెయిన్ గా సౌత్ దర్శకుల్లో అయితే యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఒకడు. చేసినవి కేవలం మూడు సినిమాలే అయినప్పటికీ తాను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా గట్టిది. ఇక తన విజన్ కి ప్రభాస్ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుందో “సలార్” సినిమాతో తాను చూపించేందుకు సిద్ధం అయ్యాడు.

కాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాబోతుండగా ప్రశాంత్ నీల్ ఈ సినిమా సహా తన మొదటి సినిమా “ఉగ్రం” “కేజీఎఫ్” సినిమాలు ఇపుడు సలార్ చూసినా కూడా అన్నీ ఒకే కలర్ టోన్ లో కనిపిస్తాయి. దాదాపు నటీనటులు అంతా ఒక డార్క్ కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తూ ఉంటారు.

అలాగే పాత్రలు ఉండే ప్రాంతాలు కూడా ఒకే కలర్ టోన్ లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాలు ఎందుకు ఒకేలా ఉంటాయో చెప్పాడు. తనకి ఎక్కువ రంగులు చూడడం కానీ చూపించడం ఇష్టం ఉండదు అని అందుకే నా సినిమాల్లో ఎక్కువ బ్లాక్ లేదా ఒకే కలర్ మాత్రమే చూపించడానికి ఇష్టపడతాను అని తెలిపాడు.

దీనితో అందుకే తన సినిమాలు అలానే ఉంటాయని రివీల్ చేసాడు. ఐతే చాలా మంది కేజీఎఫ్ 2 చూసిన తర్వాత సలార్ అనౌన్స్ చేసినపుడు ఇది కూడా దానిలానే ఉంది ఏంటి రెండు సినిమాలకి కనెక్షన్ ఉందా అంటూ చాలా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనేది నీల్ ఇప్పుడు రివీల్ చేయడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.