‘హనుమంతుడు’ సరే, హీరో ఎవరు.?

ప్రస్తుతం చేతిలో వున్న ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేసి, అర్జంటుగా ‘జై హనుమాన్’ సినిమా పనుల్లో బిజీ అయిపోవాలనుంది దర్శకుడు ప్రశాంత్ వర్మకి.! ‘హనుమాన్’ సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్కు అలాంటిది.

మూడొందల కోట్ల క్లబ్బులోకి ‘హనుమాన్’ సినిమా చేరిపోయింది. మామూలు అచీవ్‌మెంట్ కాదిది.! చాలా చాలా పెద్ద విజయం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్‌గా మారిపోయాడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో.

ఇప్పుడు ప్రశాంత్ వర్మకి ఓ హీరో దొరకాలి. సూపర్ హీరో అంటే ఇలా వుండాలి.. అనేంతటి స్టార్‌డమ్ వున్న పవర్ ఫుల్ హీరో కావాలి. అదీ ‘హనుమాన్’ పాత్ర కోసం. ‘హనుమంతుడు’ పాత్రలో తేజ సజ్జ కొనసాగుతాడు.

ఇప్పటికే పలువురితో ప్రశాంత్ వర్మ చర్చించాడు. చెన్నయ్ కూడా వెళ్ళొచ్చాడు. బెంగళూరులోనూ మంతనాలు జరిగాయి. హైద్రాబాద్‌లోనూ చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ఆలోచనలు మాత్రం చేయడంలేదట.

మార్చి – ఏప్రిల్ నాటికి ఓ స్పష్టత వస్తుందని అంటున్నారు. ఓ స్టార్ హీరో, నిర్మాణంలోనూ భాగస్వామ్యం అడిగాడని టాక్.! అంటే, అతడే ‘హనుమాన్’ అనుకోవచ్చా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!