ప్రణీత ఇంత ట్యాలెంటెడా?.. పదో తరగతి మార్క్ షీట్ వైరల్!!

Pranitha Subhash Tenth Class marks sheet Goes Viral

కొందరు భామలు ఎంతో అందంగా ఉంటారు.. అలాంటి వారు చదువులో కాస్త వెనుకబడి ఉంటారని అంటారు. కానీ ప్రణీత విషయంలో అది రివర్స్ అయింది. అందం ఎంత ఉందో.. చదువులో అంత ముందుంది. ఆమె పదోతరగతి మార్కుల జాబితా, మెమో చూస్తే ఎవ్వరైనా సరే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ప్రణీత కన్నడ సుందరి అని అందరికీ తెలిసిందే. ప్రణీత తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ఓ ఆట ఆడింది.

సమంత, ప్రణీతలు తాజాగా ఓ ఆట ఆడారు. తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో కొత్త ట్రెండ్‌కు తెరదీశారు. ఎలాంటి ఫోటో అయినా అడగండి.. నేను పంపిస్తాను అంటూ అభిమానులకు ఆఫర్ ఇచ్చారు. ఇందులో సమంతను వింత వింత ఫోటోలు అడిగారు. కోపంగా ఉన్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మేకప్ లేకుండా ఉన్నప్పుడు అంటూ వింత వింత ఫోటోలను అడిగారు.

Pranitha Subhash Tenth Class marks sheet Goes Viral
Pranitha Subhash Tenth Class marks sheet Goes Viral

అలాగే ప్రణీతను కూడా వెరైటీ ఫోటోలను అడిగారు. అందులో భాగంగా ఓ నెటిజన్ పదో తరగతి మార్కుల షీట్‌ను అడిగాడు. దీంతో ఆమె తన పదో తరగతి మెమోను షేర్ చేసింది. బెంగళూరులో చదివినట్టు తెలుస్తోంది. ఇంగ్లీష్‌లో 83 శాతం, కన్నడలో 90 శాతం, లెక్కల్లో 90 శాతం, సైన్స్‌లో 90 శాతం, లెక్కల్లో 95 శాతం మార్కలను స్కోర్ చేసింది. ఇంత చేసినా కూడా చివరకు ఏదో పర్వాలేదని అలా మార్కులు వచ్చాయని ఎంతో సింపుల్‌గా కామెంట్ చేసింది.