తన ఫామ్ హౌస్ కి పేరు పెట్టిన ఎన్టీఆర్…ఏ పేరు పెట్టారో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాల పరంగా ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం ఎన్టీఆర్ తన సమయాన్ని కేటాయిస్తూ వీలైనప్పుడల్లా కుటుంబంతో గడపడానికి ఇష్టపడతారు.

ఇక ఎన్టీఆర్ భార్య ప్రణతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో అడుగు పెట్టకపోయినా తనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ తన భార్య కొడుకులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనుక షేర్ చేస్తే క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతికి గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా తన భార్యకు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ కానుకగా ఇచ్చిన సంగతి మనకు తెలిసింది.

ఈ విధంగా తన భార్య పుట్టినరోజు సందర్భంగా తన భార్యకు ఎన్టీఆర్ ఇలాంటి బహుమతి తన పేరుపై రాసిచ్చారు.ఇకపోతే తాజాగా ఈ ఫామ్ హౌస్ కి ఎన్టీఆర్ పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ కి ఎన్టీఆర్ బృందావనం అనే పేరు పెట్టారని సమాచారం. ఈ పేరు వినగానే మనకు ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా బృందావనం గుర్తుకొస్తుంది.ఎన్టీఆర్ ఎప్పుడైనా కుటుంబ సభ్యుల సమక్షంలోనూ లేదంటే స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడం కోసం ఈ ఫామ్ హౌస్ కొనుగోలు చేసి దీనికి బృందావనం అనే పేరు పెట్టడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.