Pranitha : తల్లి కాబోతున్న బాపుగారి బొమ్మ…. భర్త పుట్టిన రోజు శుభవార్త చెప్పిన ముద్దుగుమ్మ…!

Pranitha : ఏమి పిల్లడో ఏమి పిల్లదో సినిమా,బావ సినిమాతో పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ అత్తారింటికి దారేది సినిమాతో బాగా ఫేమస్ అయింది. అందులో బాపూగారి బొమ్మ సాంగ్ తో బాగా పాపులర్.ఇక ఎన్టీఆర్ రభసలో రాకాసి అంటూ సందడి చేసింది. ఇక ఈ కన్నడ కస్తూరి కన్నడలో దర్శన్ సినిమాతో మొదలుపెట్టి, తెలుగు, తమిళంలో కూడా మంచి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ తో హలో గురు ప్రేమకోసమే లో నటించిన ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ సరసన బ్రహ్మోత్సవం లో కూడా నటించింది. ఇక తమిళ లో సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ తో నటించి పేరు తెచ్చుకుంది.

గతేడాది వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రణీత వివాహం జరిగింది. అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది.కానీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రణీత తన గురించి అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక తాను తల్లి కాబోతున్న విషయాన్నీ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక తన భర్త పుట్టినరోజున ఈ విషయం అందరికి తెలియజేయడం సంతోషంగా ఉందని చెప్పింది.

హెచ్‌సీజీ హోమ్‌ టెస్టింగ్‌ రిజల్ట్‌ తోపాటు, స్కానింగ్‌ కాపీని కూడా చూపిస్తూ తన భర్తను హత్తుకుని ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.. తన భర్త పుట్టినరోజు నాడే ఈ విషయం తనకు ఈ శుభవార్త చెప్పడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమె పోస్ట్‌ చేసింది.