భలే క్యూట్‌గా ఉందే.. బుల్లి నిక్కర్‌లో ప్రణీత రచ్చ

Pranitha Subhash latest cool pic

బాపుగారి బొమ్మ అనే పాటను తన కోసమే రాశారేమో అనేంత అందంగా ప్రణీత ఉంటుంది. పెద్ద పెద్ద కళ్లతోటి అనే పాటను అయితే నిజంగానే ఆమె కోసం పాడేశాడు దేవీ శ్రీ ప్రసాద్. అలా ప్రణీత కళ్లు, అందం ఎంతో మందిని కట్టిపడేసింది. అయితే లాక్డౌన్ కంటే ముందు ప్రణీత అందాన్నే అందరూ చూశారు. కానీ ఆ అందం కంటే ఆమె మనసు ఎంతో గొప్పది, చల్లనైందని తెలుసుకున్నారు. అలా లాక్డౌన్‌లో ప్రణీత చేసిన సేవా కార్యక్రమాలతో మరింత పాపులారిటీ పెరిగింది.

Pranitha Subhash latest cool pic
Pranitha Subhash latest cool pic

ప్రణీత సేవా కార్యక్రమాలు చేయడంలో ఎంతో ముందుంటుంది. ఎంతో మంది ఆకలిని తీర్చింది. అలా సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌లో కనిపించింది ఓ ఐదు పది నిమిషాలే గానీ ఆరోజంతా హాట్ టాపిక్ అయింది. కళ్లతోనే కట్టిపడేసేలా చేసే ప్రణీతను చూసి అందరూ పడిపోయారు. అయితే తాజాగా ప్రణీత ఓ క్యూట్ ఫోటోను షేర్ చేసింది.

మామూలుగానే ప్రణీత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో ముచ్చట్లు పెడుతూ వారి అడిగే కొంటె ప్రశ్నలకు సమధానాలు చెబుతూ ఉంటుంది. అయితే తాజాగా ప్రణీత అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. క్యూట్‌గా చిన్న పిల్లలా పోజు పెడుతూ ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే అందులో బుల్లి నిక్కర్ ధరించడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.