మొహం మీద సూదులతో.. ప్రణీత పిక్ వైరల్

Pranitha Subhash is taken Acupuncture Treatment

హీరోయిన్ ప్రణీత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఫోటోలతోనూ రచ్చ చేస్తోంది. లాక్డౌన్ సమయంలో అయితే అన్నదానం, ఫుడ్ ప్యాకెట్ల పంపిణి వంటి సేవా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది. ఈ మధ్య ప్రణీత సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఈ క్రమంలో ప్రణీత రకరకాల ఫోటోలను షేర్ చేసింది. నెటిజన్లు అడిగిన ఫోటోలను షేర్ చేయడంతో తెగ వైరల్ అయింది.

Pranitha Subhash is taken Acupuncture Treatment
Pranitha Subhash is taken Acupuncture Treatment

బాత్ టబ్ పిక్‌ను ఓ నెటిజన్ అడగడంతో డైరెక్ట్‌గా ఆ ఫోటోను షేర్ చేసింది. పదో తరగతి మార్కుల జాబితాను అడగడంతో అది కూడా షేర్ చేసింది. ఇక ప్రణీత ట్యాలెంట్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఇక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడా? అనే అనుమానం కలిగేలా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇష్టమైన నటుడు ఎవరని అడిగితే.. పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేసింది. అలా ప్రణీత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. రీసెంట్ మరోసారి బాత్ టబ్ పిక్‌ను షేర్ చేసింది.

ఇప్పుడు మళ్లీ మరో ఫోటోను షేర్ చేసింది. అయితే ఇందులో మాత్రం ప్రణీత మొహానికి సూదులు గుచ్చి ఉన్నాయి. అక్యుపంక్చర్ వైద్య విధానం గురించి అందరికీ తెలిసిందే. ఒంట్లోని నొప్పులను సూదులు గుచ్చి నయం చేస్తారు. ఇది చైనాలోని పురాతన వైద్య విధానం. ఇదే విషయాన్ని ప్రణీత చెబుతూ అక్యుపంక్చర్ చేసుకున్నాని తెలిపింది. ఇందులో ప్రణీత మొహం మీద సన్నటి సూదులు గుచ్చి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.