Megastar And Salman : మాసివ్ అప్డేట్ : చిరుకి సాంగ్ కోసం ప్రభుదేవా..ఏ సినిమాలో ఫిక్స్ అంటే.!

Megastar And Salman : అసలు తెలుగు సినిమా దగ్గర డాన్స్ అంటేనే తనకి ఒక స్పెషల్ ట్రెండ్ ని సెట్ చేసుకున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఒక్క తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా బాలీవుడ్ లో స్టార్ హీరోలకి కూడా మెగా స్టార్ నే ఒక ఐడల్. అందుకే తన సినిమాలు ఎలా ఉన్నా కూడా తన సినిమాల్లో డాన్స్ ట్రీట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తారు.
లేటెస్ట్ గా “ఆచార్య” లో కూడా చిరు పాటల్లో 66 ఏళ్ల వయసులో రామ్ చరణ్ తో పోటీ పది అదరగొట్టారు. మరి అలాంటి చిరు గ్రేస్ కి తగ్గట్టుగా డాన్స్ కంపోజ్ చెయ్యడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఎప్పుడు నుంచో అనేక హుక్ స్టెప్స్ తో అలరిస్తూ వస్తున్న మెగాస్టార్ ఇప్పుడు క్రేజీ కాంబోతో మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత రాబోతున్నారు.
ఇండియన్ సినిమా దగ్గర నెంబర్ 1 డాన్స్ కొరియోగ్రాఫర్ అయినటువంటి ప్రభుదేవా తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్న “గాడ్ ఫాదర్” లో థమన్ ఇచ్చిన ఓ స్పెషల్ సాంగ్ కి గాను ప్రభుదేవా ని తీసుకొచ్చినట్టుగా ఈరోజు ఉదయం కన్ఫర్మ్ చేశారు.
మరి ఈ సాంగ్ చిరు మరియు సల్మాన్ లపై ఉంటుంది అని థమన్ తెలిపాడు. మరి ఇద్దరు మెగాస్టార్స్ తో ప్రభుదేవా సాంగ్ అంటే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అని చెప్పాలి. ఇది వరకే సల్మాన్ తో ప్రభుదేవా చాలా సినిమాలు చేశారు. దీనితో ఈ సాంగ్ మరింత కేజ్రీగా ఉంటుందని చెప్పాలి. ఇక క్రేజీ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
https://twitter.com/MusicThaman/status/1521284381330968576