Prabhas : లేట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా ని చూసిన ప్రభాస్ ,10 సీన్ లకు కన్నీరు పెట్టుకున్నా అంటూ కామెంట్స్…!

Prabhas : ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ యొక్క గొప్పదనాన్ని మరొకసారి ఆర్ఆర్ఆర్ సినిమాతో నలుదిక్కులా చాటింప చేశాడు దర్శకుడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో హీరోలుగా చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకరితో ఒకరు పోటీపడి నటించిన సంగతి తెలిసిందే. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదల అయిన రోజు నుంచి రికార్డుల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమాని చాలామంది సెలబ్రిటీలు చూసి తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సినిమాలు తీసిన దర్శకరత్న ప్రతిభను, అలాగే హీరో ల నటనను మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో చూపించిన ఎమోషన్స్ గురించి పొగడ్తల వర్షం కురిపించారు. అయితే తాజాగా డార్లింగ్ ప్రభాస్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి స్పందించారు.

ఎందుకోమరి ప్రభాస్ సినిమాని ఆలస్యంగా చూసినట్టు వున్నాడు,ఇక ఈ
సినిమాపై స్పందిస్తూ… నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ రీసెంట్ గా చూసాను.
చాలా బాగా నచ్చింది.దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన కొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఆల్రెడీ రూ.1100 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ మూవీ గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఆల్మోస్ట్ 10 సీన్స్ లో నాకు కన్నీళ్లు వచ్చేసాయి.మొత్తంగా 50 సీన్లు నన్ను కట్టిపడేశాయి. మూవీ చాలా చాలా బాగుంది’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసాడు ప్రభాస్.ఐతే ఆర్ఆర్ఆర్ అభిమానులు మాత్రం ఆ సీన్ లు కొమరం బీముడో పాట అని ఇంకా ఇంట్రవెల్ సీన్ అయివుండొచ్చు అని అభిప్రాయం పడుతున్నారు.