పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాల పరంగా దూకుడు పెంచాడు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక్కొక్క సినిమా కధ ఒక్కొక్క జోనర్లో ఉండేలా ప్లాన్ చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా తో తీయబోయే స్పిరిట్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం.
ఈ సినిమాని డిసెంబర్ లో అఫీషియల్ గా లాంచ్ చేసి ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి డార్లింగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలో ప్రభాస్ రూత్ లెస్ కాప్ గా కనిపిస్తాడని, ఫస్ట్ టైం ప్రభాస్ యూనిఫాంలో కనిపిస్తారనే ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది.
అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ సినిమాలో కొరియన్ స్టార్ హీరో మా డాంగ్ సియోక్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో సీయోక్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా కనిపిస్తారని ప్రభాస్ అతన్ని ఎదిరించే ఇండియన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని, అంతేకాకుండా వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు సమాచారం. స్పిరిట్ కధ కూడా గ్లోబల్ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం.
అయితే ఈ న్యూస్ తెలిసిన డార్లింగ్ ఫాన్స్ తెగ ఆనంద పడుతున్నారు. ఇప్పటికే సాలార్, కల్కి 2898 ఏడి సినిమాలతో ప్రభాస్ గ్లోబల్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక స్పిరిట్ సినిమాతో అతను హాలీవుడ్ స్టార్ గా మారటం పక్కా అంటున్నారు డార్లింగ్ ఫాన్స్. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు మూవీ టీం.