రెమ్యూనరేషన్ విషయంలో రికార్డ్ సృష్టించిన ప్రభాస్..!

Qbck2Ffl 1 | Telugu Rajyam

బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బాహుబలి చిత్రం తర్వాత నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.ఈ క్రమంలోనే ఇతనికి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో దర్శకనిర్మాతలు ఇతనితో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు ప్రభాస్ ఫ్యాన్స్ పెరగడంతో ఇతని పారితోషికం కూడా అదే స్థాయిలో పెంచుతూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏ హీరో తీసుకొని రెమ్యూనరేషన్ ను ప్రభాస్ తీసుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత తన సినిమాలన్ని పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల బడ్జెట్ తో నిర్మింతమవుతున్నాయి.ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా వెల్లడించారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో నటించినందుకు గానూ ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం గమనార్హం. ఈ సినిమా ద్వారా ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఇలా ఒక సినిమాకు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ రికార్డులు సృష్టించారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles