రాథేశ్యామ్‌ స్టోరీలైన్‌ … విని నవ్వుకున్నారట…!

Radhe Shyam

‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తరువాత ‘సాహో’ లాంటి మరో క్రేజీ సినిమా తర్వాత త్వరలో రాథేశ్యామ్‌.  ఇలా రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో  దుమ్ములేపుతున్నాడు. వరుసగా విడుదలవుతున్న రాథేశ్యామ్‌ మోషన్‌ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీగా అంచనాలను పెంచుతున్నాయి.

Radhe Shyam

రాథేశ్యామ్‌ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ అభిమానులకు తెగ నచ్చేసింది. అతడి సరసన  పూజ హెగ్డే కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రం స్టోరీలైన్‌ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‌ రాథేశ్యామ్‌ స్టోరీలైన్‌ ఇదే అని ఒకరు, అది కానేకాదు ఇది అని మరి కొందరు ఎవరికీ ఇష్టం ఇష్టం వచ్చిన కథని వారు రాసేసుకుంటున్నారు.  

ఈ కథ జ్యోతిష్యానికి, సైన్సుకు మధ్య కొనసాగే కథని ఈ చిత్రంలో  ప్రధాన పాత్ర పోషిస్తున్న సచిన్‌ కేడ్కర్‌ రాథేశ్యామ్‌ స్టోరీలైన్‌ను బయటపెట్టేశారు. ఇది చూసిన చిత్ర యూనిట్, దర్శకుడితో సహా నవ్వుకున్నారట. ఈ సినిమా కాన్సెప్ట్‌ విషయంలో మరో చోట ఓ నెటిజన్ కథ మొత్తం మూఢ నమ్మకాలపై సాగుతుందని, ఈ విషయం చిత్రం యూనిట్లో ఓ  ముఖ్యమైన వ్యక్తి చెప్పాడని పోస్ట్ చేసి  సంచలనం సృష్టించాడు. ఏది ఏమైనా   ఇలా రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమా విషయంలో అప్పుడే ఇలా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుండడం ఇండస్ట్రీని కుదుపేస్తోంది.