టాలీవుడ్ ఇండస్ట్రీకి చిలకా గోరింక అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటుడు కృష్ణంరాజు. ఈయన పలు సినిమాలలో హీరోగా అలాగే విలన్ పాత్రలలోను నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అగ్ర నటుడుగా కొనసాగుతున్న ఈయన ఇప్పటికీ ప్రభాస్ నటిస్తున్నటువంటి పలు సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ సందడి చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స నిమిత్తం కృష్ణంరాజుని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ లో చేర్పించారు.
హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఈయనని నిన్న సాయంత్రం ప్రభాస్ వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలోనే నేడు ఉదయం తెల్లవారుజామున 3:25 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణించారని తెలియడంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఇక ఈ విషయం తెలిసిన కృష్ణంరాజు కుటుంబ సభ్యులు తీవ్రవిషాదంలోకి వెళ్లిపోయారు.ఇక కృష్ణంరాజు లేరని వార్త తెలియగానే పలువురి సినీ ప్రముఖులు వారితో ఈయనకున్న అనుబంధం గుర్తుచేసుకొని బాధపడ్డారు.
కృష్ణంరాజు 1940 జనవరి 20 పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఇలా నటనపై ఆశక్తి ఉన్నటువంటి ఈయన పలు నాటకాలు వేస్తూ అనంతరం సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన తుది శ్వాస వదిలేవరకు సినిమాలలో నటించారు. ఇక ఈయన చివరిగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాలో నటించారు. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఈయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.