Radhe Shyam : ప్రభాస్ సినిమాకి మళ్ళీ కళ్ళు చెదిరే భారీ ఆఫర్ వచ్చిందట! ఎన్ని వందల కోట్లు అంటే?

Radhe Shyam : ప్రస్తుతం మళ్ళీ ప్రశ్నార్ధకంగా మారిన భారీ సినిమాల రిలీజ్ లలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “రాధే శ్యామ్” కూడా ఒకటి. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఈ జనవరి 14నే తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ కాగా మరోపక్క సినిమా వాయిదా కన్ఫర్మ్ అనే పుకార్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఇక ఇది పక్కన పెడితే ఈ భారీ సినిమాకి మళ్ళీ కళ్ళు చెదిరే ఓటిటి ఆఫర్ భారీ ఫిగర్ తో వచ్చిందట. తాజా రూమర్స్ ప్రకారం అయ్యితే ఓ దిగ్గజ ఓటిటి సంస్థ రాధే శ్యామ్ కి 400 కోట్లు నుంచి 500 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారట. అయితే ఇలాంటి ఒక ఆఫర్ నే రెండో లాక్ డౌన్ టైం లో కూడా ఈ సినిమాకి వచ్చింది.

కానీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి నెలకొంది అని వచ్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ అయితే రాలేదు. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు. అలాగే ఆల్రెడీ వచ్చిన పాటలు సూపర్ హిట్ కూడా అయ్యాయి.