బిల్లా బదులు ఆ సినిమాని రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి రికార్డులు బద్దలు అయ్యేవి: వర్మ

వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ వర్మ తరచు ఏదో ఒక విషయంలో తల దూరుస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాల గురించి స్పందిస్తూ ఉంటాడు. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ నటించిన సినిమాల గురించి రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ నటించిన “బిల్లా” సినిమాని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల చేసిన థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రాంగోపాల్ వర్మ స్పందిస్తూ…ఇది ప్రభాస్ అభిమానుల పిచ్చి చర్యగా వర్ణించాడు. ఆ తర్వాత మరో ఫోటోని షేర్‌ చేస్తూ ప్రభాస్‌ అభిమానులు దీపావళి జరుపుకునే స్టయిల్‌ ఇదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. అంతే కాకుండా గతంలో ప్రభాస్ నటించిన డిజాస్టర్ సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా గురించి వెటకారంగా కామెంట్స్ చేశాడు. ఈ మేరకు … రాధే శ్యామ్ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ చేసుంటే బాహుబలి సినిమా రికార్డులు బద్దలు కొట్టేది అంటూ … రాధే శ్యామ్ డిజాస్టర్ అని తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ.. ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.