Radhe Shyam : వైరల్ : “రాధే శ్యామ్” విషయంలో డైరెక్టర్ కి షాకిచ్చిన జ్యోతిష్కుడు!

Radhe Shyam : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా మరింత ఆసక్తిని అందరి లోనూ రేపింది. మరి ఇదిలా ఉంటే ఈ సినిమా వృత్తాంతం ఏంటి? ప్రభాస్ పాత్ర ఏమిటో అనేవి కూడా అందరికీ తెలుసు.

ప్రభాస్ ఒక పామిస్ట్ గా అంటే ఒక జ్యోతిష్కునిగా కనిపించనున్నాడు. అది కూడా 1930, 40 ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన జ్యోతిష్కునిగా.. అయితే ఇలాంటి కథలో ప్రేమ ను కూడా జోడించి దర్శకుడు రాధా కృష్ణ ఒక ఆసక్తికర ప్రయత్నం చేసాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఒక నాలుగేళ్లు కి ముందు కొంతమంది జ్యోతిష్కులని కలిసి సబ్జెక్టు కోసం రీసెర్చ్ చేస్తుండగా ఓ జ్యోతిష్కుడు ఈ సినిమా 2022 లో రిలీజ్ అవుతుందని చెప్పారని లేటెస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పాడు.

అయితే అది అప్పుడు అతడు నమ్మాడో లేదో కానీ నిజంగా ఇప్పుడు ఈ సినిమా 2022 లోనే రిలీజ్ అవుతుంది. ఇది వినడానికి ఒకింత ఆసక్తిగా ఉన్నా దర్శకుడు మాత్రం తనకి తగిలిన ఈ షాకింగ్ ఫ్యాక్ట్ ని రివీల్ చెయ్యగా ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది.