RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తిరిగి ఈ సినిమాని ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాని జనవరి 7వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించి పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ముంబైలో భారీ ఖర్చుతో ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించారు.
అయితే జనవరి 7వ తేదీన ఈ సినిమా వాయిదా పడటంతో తిరిగి ఈ సినిమాని 25వ తేదీ మార్చి విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా వేగవంతం చేయాలని చిత్రబృందం భావించారు. ఈ క్రమంలోనే మార్చి 18, 19వ తేదీల్లో దుబాయ్ బెంగళూరు వంటి ప్రాంతాలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫాలో జరిగే ‘RRR’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడనీ తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా గురించి మరికొన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.