‘ఆదిపురుష్’ కష్టమేనట.! నిజమేనా.?

ప్రభాస్ గురించి ఇలాంటి ఓ ప్రచారం.. అది ఉత్త గాసిప్ అయినాగానీ, జీర్ణించుకోవడం కష్టమే. పాన్ ఇండియా హీరోయిజం ప్రభాస్‌ది.! ‘బాహుబలి’తో ప్రభాస్ సాధించుకున్న క్రేజ్ అంతా, ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో అటకెక్కిపోయింది.

ఇప్పుడు ప్రభాస్ మళ్ళీ ఫ్రెష్ బిగినింగ్.. అనుకోవాలేమో పాన్ ఇండియా ఇమేజ్ విషయంలో. అబ్బే, అదేం లేదు.. ‘ప్రాజెక్ట్-కె’, ‘సలార్’ లాంటి సినిమాలున్నాయని ప్రభాస్ అనొచ్చుగాక. కానీ, ‘ఆదిపురుష్’ పరిస్థితేంటి.?

జూన్ 16న సినిమా రిలీజ్.. అని గతంలో చెప్పుకున్నారు. కానీ, ప్రమోషన్స్ అయితే మొదలవలేదు. అభిమానులు తీవ్రంగా గుస్సా అవుతున్నారు. మేకర్స్‌ని నానా తిట్లూ తిట్టేస్తున్నారు.

ఓం రౌత్ స్పందించడు. ప్రభాస్ పెదవి విప్పడు.! సంక్రాంతికి రావాల్సిన సినిమా.. వాయిదా పడింది. కాదు కాదు అంతకు ముందెప్పుడో రావాల్సిన సినిమా. ఇప్పుడేమో వస్తుందో లేదో తెలియని అయోమయం.!