‘ఆదిపురుష్’ ఆపేస్తేనే బెటర్.?

సినీ పరిశ్రమలో ఇంతకు ముందెన్నడూ లేని వింత ఇది.! వందల కోట్లు ఖర్చు చేస్తున్న సినిమాని, మధ్యలోనే ఆపెయ్యమంటున్నారు. అది ‘ఆదిపురుష్’ సినిమా. ఆ సినిమాని ఆపెయ్యమంటున్నది స్వయానా ప్రభాస్ అభిమానులే.

ఏ హీరో సినిమా నుంచైనా అప్‌డేట్ వస్తోందంటే, అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కానీ, ‘ఆదిపురుష్’ విషయంలో అభిమానులు భయపడుతున్నారు. ఒక్క ఈ సినిమా విషయంలోనే కాదు, ‘మారుతి’ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకీ ఇదే భయం.

శ్రీరామనవమి రోజున విడుదలైన ‘ఆదిపురుష్’ పోస్టర్ అయితే, అభిమానులకి చేదు అనుభవాన్నిచ్చింది. సీతాదేవి పాత్రలో కృతిసనన్ కావొచ్చు, రాముడి పాత్రలో ప్రభాస్ కావొచ్చు.. ఇద్దరూ తేలిపోయారు. లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రల గురించి మాట్లాడుకోవడం అనవసరం.

ఈ ఫీడ్ బ్యాక్ విన్నాక ప్రభాస్ చాలా అప్‌సెట్ అయ్యాడట. ఫిలిం మేకర్ ఓం రౌత్ మీద మండిపడ్డాడట కూడా.! డార్లింగుకే అంత కోపమొచ్చిందంటే, ఇక సినిమాని రిలీజ్ చేయడం దండగ.