ప్రభాస్, బన్నీ అభిమానుల మధ్య మొదలైన పోస్టర్ వార్?

ఇండియా టుడే తాజా సంచికపై అల్లు అర్జున్ బొమ్మ కనిపించడంతో అల్లు అర్జున్ ప్రభాస్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. తాజాగా ఇండియా టుడే సంచికపై అల్లు అర్జున్ పోస్టర్ తో పాటు ‘ఐకాన్ స్టార్’తో ముచ్చట్లు ఉన్నాయి. ఈ పోస్టర్ తో పాటు గత సంవత్సరం డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప- ద రైజ్’ సినిమా వసూళ్ళనూ పేర్కొన్నారు. అయితే ఇందులో విశేషమేముంది అని అనుకోవచ్చు. కానీ.. ఐదేళ్ళ క్రితం ప్రభాస్ నటించిన ‘బాహుబలి-2’ విడుదలయ్యాక ఇదే ‘ఇండియా టుడే’ కవర్ పై ప్రభాస్ ఫొటోలో కవర్ పేజ్ లో కనిపించింది. ఆ సమయంలో ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’ అని పేర్కొనగా, ఇప్పుడు అల్లు అర్జున్ కవర్ తో వచ్చిన సంచికపై ‘ద సౌత్ స్వాగ్’ అని రాశారు. అయితే ఈ సంచికలో అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా నార్త్ లో కూడా సౌత్ ఇండియా సినిమా ఎలా డామినేట్ చేస్తోందో వివరించే స్టోరీ.

అయితే గతంలో బాహుబలి 2 సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా విజయానికి సంబంధించిన కథను మాత్రమే కవర్ స్టోరీగా రాశారు. ఈ కారణంతో ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలయ్యింది. అయితే ఇటీవల ఇండియా టుడే మ్యాగజైన్ లో అల్లు అర్జున్ గురించి రాసిన స్టొరీ ఇప్పుడు అభిమానుల మధ్య చిచ్చు రాజేసింది. అయితే ఈ వివాదాన్ని కూడా ఒక న్యూస్ ఛానెల్ స్పెషల్ స్టోరీగా ఓ అరగంట పాటు ప్రసారం చేయడం గమనార్హం! ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో ‘ఇండియా టుడే’కు చెందిన ఇండియా టుడే ఎంటర్ టైన్ మెంట్ బ్యూరో దీపాలీ పటేల్, ఇండియా టుడే డిప్యూటీ ఎడిటర్ సుహానీ సింగ్, స్పెషల్ కరస్పాండెంట్ నబిలా జమాల్, ప్రముఖ నటి కస్తూరి, ఇండియా టుడే ఛీఫ్ ఫోటోగ్రాఫర్ అక్షిత నందగోపాల్ పాల్గొన్నారు.

ఈ క్రమంలో దీపాలి పటేల్ మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో ఇలా అభిమానుల మధ్య గొడవ జరగడం సర్వసాధారణమే అని ఆవిడ పేర్కొన్నారు. పుష్ప సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకోవడానికి గల కారణం పుష్ప సినిమా సీక్వెల్ . ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల వసూళ్ల సునామీని చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ భయపడుతోందని ఆవిడ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాలీవుడ్ సూపర్ స్టార్ అభిమానుల మధ్య జరుగుతున్న వారి గురించి యాంకర్ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి కస్తూరి కూడా ఫోన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇంతవరకు ఇంతవరకు బాలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడుకున్న మనం, ఇప్పుడు ప్రభాస్, యశ్, అర్జున్ లాంటి సౌత్ సూపర్ స్టార్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చించుకొనే రోజులు వచ్చాయని, ఈ మార్పు ఆహ్వానించదగ్గదే అని ఆమె వెల్లడించారు.